సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఒకటవ కేటగిరి వేతనం అమలు చేయాలి.

0
TMedia (Telugu News) :

టీ, మీడియా, అక్టోబర్,30 మణుగూరు .

సింగరేణి లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఒకటవ కేటగిరి వేతనం అమలు చేయాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి సింగరేణి యాజమాన్యం ని డిమాండ్ చేశారు. శనివారం కె సి హెచ్ పి, జిఎం ఆఫీస్, సివిల్ తదితర విభాగాల్లో జరిగిన కాంట్రాక్ట్ కార్మికుల సమావేశాలలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి లో పర్మినెంట్ కార్మికుల తో సమానంగా కాంట్రాక్టు కార్మికులు కూడా పనిచేస్తూ సంస్థ లాభాలలో కీలక పాత్ర పోషిస్తున్న ప్పటికీ వారికి సరైన వేతనాలు, ఇతర చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు.

నవంబర్ 15 వ తారీకున కోల్కతాలో జరిగే పదకొండవ వేజ్ బోర్డు సమావేశంలో కంట్రాక్టు కార్మికులకు ఒకటో కేటగిరి వేతనం అమలు చేసే విధంగా వేజ్ బోర్డు సంఘాలు, కోల్ ఇండియా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఒకటో కేటగిరి వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 15 న కోల్ కతాలోని కోల్ ఇండియా ఆఫీస్ ముందు దేశ వ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల తోటి ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలో కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మణుగూరు బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు
వీ జానయ్య, ఎండీ గౌస్, నాయకులు రామకృష్ణ ,రాజిరెడ్డి ,వెంకట్, రాజేష్, వెంకటేశ్వర్లు, ఆనంద్ ,వీరభద్రం, రవి తదితరులు పాల్గొన్నారు.

First category wage should be implemented for Singareni contract workers.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube