అదే గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ మొదటి విజయం

ఎంపీ సంతోష్‌ కుమార్‌

1
TMedia (Telugu News) :

అదే గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ మొదటి విజయం

– ఎంపీ సంతోష్‌ కుమార్‌

టీ మీడియా, డిసెంబరు 7, ములుగు : వేడుక ఏదైనా మొక్క నాటాలనే ఆలోచన ప్రతిఒక్కరిలో తీసుకురావడంతో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ మొదటి విజయాన్ని సాధించిందని ఎంపీ సంతోష్‌ కుమార్‌ అన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో మొక్కలు నాటడం గొప్ప విషయమన్నారు. ఆలోచనలను ఆచరణగా మార్చి లక్ష్య సాధన కోసం కృషిచేయడంలోనే నిజమైన విజయం ఉందన్న స్ఫూర్తిని బలంగా నమ్మడంతోనే ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాలకు దగ్గర చేయగలిగామని వెల్లడించారు. బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ములుగు ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (FCRI) ఆవరణలో సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఫారెస్ట్ కాలేజీలో విద్యను అభ్యసిస్తున్న వందలాది మంది విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలను మొక్కలు నాటడం ద్వారా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Also Read : కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి హరీశ్‌ రావు

ఆలోచనలను అశయాలుగా మార్చి వాటి సాధనకు కృషి చేయటం ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్ ఆచరణలో పెట్టారు. అదే స్ఫూర్తి నుంచి ప్రేరణ పొందుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి దాకా స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి ఎంపీ సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube