నాగాలాండ్‌ అసెంబ్లీలోకి మొదటిసారి మహిళా ఎమ్మెల్యే..

నాగాలాండ్‌ అసెంబ్లీలోకి మొదటిసారి మహిళా ఎమ్మెల్యే..

0
TMedia (Telugu News) :

నాగాలాండ్‌ అసెంబ్లీలోకి మొదటిసారి మహిళా ఎమ్మెల్యే..

టీ మీడియా, మార్చ్2, కొహిమా : నాగాలాండ్‌ అసెంబ్లీలో మొదటిసారి ఓ మహిళ ఎమ్మెల్యే అడుగు పెట్టబోతున్నారు. నాగాలాండ్‌ రాష్ట్ర హోదా సాధించిన తర్వాత మొదటిసారి న్యాయవాది, సామాజిక కార్యకర్త అయిన హెకాని జఖాలా (48) ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు. బిజెపి మిత్ర పక్షమైన ఎన్‌డిపిపికి చెందిన హెకానీ జఖాలు దిమాపూర్‌ స్థానం నుండి 1,536 ఓట్లతో విజయం సాధించారు. లోక్‌జనశక్తి పార్టీకి చెందిన అజెటో జిమోమిపై ఆమె గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 183 మంది అభ్యర్థుల్లో నలుగురు మహిళల్లో ఆమె కూడా ఒకరు. ఎన్‌డిపిపికి చెందిన మరో మహిళా అభ్యర్థి సల్హౌతునో క్రూసే పశ్చిమ అంగామీ స్థానంలో ముందంజలో కొనసాగుతున్నారు.1963లో నాగాలాండ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా లభించింది.

Also Read : ప్రపంచ స్థాయి సంస్థలు విఫలమయ్యాయి : ప్రధాని మోడీ

అప్పటి నుండి ఈశాన్య రాష్ట్రంలో 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా… ఇప్పటివరకు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా గెలుపొందలేదు. రాష్ట్రంలో మొత్తం 13.17 లక్షల ఓటర్లు ఉండగా… అందులో సుమారు సగం మంది మహిళా ఓటర్లే ఉన్నారు. లింగ సమానత్వం హామీతో ఎన్‌డిపిపి ఈసారి ఎన్నికల్లో ఇద్దరు మహిళలను బరిలోకి దింపింది. బిజెపి, కాంగ్రెస్‌లు ఒక్కో మహిళకు టికెట్‌ ఇచ్చాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube