మత్స్యకారుల సంఘం ఎంపిక

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 14 వనపర్తి : తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల సంఘాన్ని మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది.జిల్లా అధ్యక్షునిగా నాగనమోని చెన్నారాములు, యువత అధ్యక్షులుగా కౌన్సిలర్ పుట్టపాక మహేష్, పట్టణ అధ్యక్షుడిగా నందిమల రవి, పట్టణ మహిళా అధ్యక్షురాలిగా జానంపేట లీలావతి, ప్రధాన కార్యదర్శిగా నందిమల రాజేశ్వరి, ముఖ్య సలహాదారులుగా వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ,సంఘం పట్టణ అధ్యక్షుడిగా ఒకటో వార్డు కౌన్సిలర్ కాగితాల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కౌన్సిలర్ కంచె రవి, స్టీరింగ్ కమిటీ సభ్యులుగా నందిమల్ల అశోక్ తదితరులను ఎన్నుకోవడం జరిగింది.అనంతరం ఎన్నికైన వారిని అభినందించి శాలువా పూలమాలలతో సన్మానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి జానంపేట శ్రీనివాసులు, గౌరవ సలహాదారులు రమేష్, ఉపాధ్యక్షులు నరసింహ, చింతకాయల జయరాములు, పట్టణ కార్యదర్శి సురేష్, యువ నాయకులు వెంకటేష్, నందిమల్ల సందీప్, రాజు, రవి, ప్రసాద్, పుట్టపాకల నరేష్, ఉందకోటి అంజి, భరత్ ,సుజాత ,లక్ష్మీ, నందిమల్ల యాదమ్మ ,చిన్నమ్మ, కళావతి ,రాధా ,సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube