ఐదుపంచాయతీలపై ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి

-సోనియా, అమిత్‌షాలతో కూడా మాట్లాడతాం

2
TMedia (Telugu News) :

ఐదుపంచాయతీలపై ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి

-సోనియా, అమిత్‌షాలతో కూడా మాట్లాడతాం

-భద్రాద్రి రామాలయంలో సంభాని, వీహెచ్‌
టీ మీడియా,మార్చి 3, భద్రాచలం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం అభివృద్ధికి ఆ ఐదు పంచాయతీలు ఎంతో అవసరమని, వీటిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని వాటిని తిరిగి భద్రాచలంలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌, మాజీ ఎంపీ వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు. భద్రాచలంలో గురువారం భద్రాద్రి రామయ్యను దర్శించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

 also read :వంట గ్యాస్‌ సిలిండర్‌లలో    మోసం 

ఐదు పంచాయతీలు న్యాయంగా తెలంగాణలోనే ఉండాలని తెలిపారు. ఆనాడు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలతో అవి ఏపీలోకి వెళ్లాయన్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భద్రాద్రి ఏజెన్సీ ప్రాంత ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆ ఐదు పంచాయతీలను తిరిగి భద్రాద్రిలో కలపాలన్నారు.

   also read:  బంగాళాఖాతంలో

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే చర్యలు చేపట్టాలన్నారు. ఈ విష యంపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కూడా సానుకూలంగా స్పందించాలన్నారు. ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలతో మాట్లాడి ఆ ఐదు పంచాయతీలు వచ్చేందుకు తమవంతు కృషి చేస్తామని హనుమంతరావు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని, లేదంటే ప్రజలు తగు రీతిలో స్పందిస్తారని మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ తెలిపారు. కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు సర్వసాధారణమని, ఎన్నికలొస్తే తామంతా ఏకతాటిపైకి వస్తామని నాయకులు తెలిపారు. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎడవల్లి కృష్ణ, సీతారాములు, తాళ్ల రమేష్‌గౌడ్‌, పి.రంగారావు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube