ఇంటింటికి జాతీయజెండా పంపిణీ

ఇంటింటికి జాతీయజెండా పంపిణీ

1
TMedia (Telugu News) :

ఇంటింటికి జాతీయజెండా పంపిణీ

టీ మీడియా, ఆగస్టు 9, అశ్వారావుపేట : భారత స్వాతంత్ర్య వజ్రోత్సవం ద్విసప్తాహం పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రం లో మంగళవారం ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి ఆధ్వర్యంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ఇంటింటికి జాతీయజెండా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Also Read : వజ్రోత్సవాలలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 సంవత్సరాలు స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలతో ప్రతి భారతీయని ఇంటి మీద జాతీయజెండా ఎగురవేసి తమ దేశభక్తిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చల్లా ప్రసాద్,సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ,పంచాయతీ ఈఓ హరికృష్ణ,సర్పంచ్ అట్టాం రమ్య,ఎంపీటీసీ భారతి,యూయస్ ప్రకాష్, పంచాయితీ సిబ్బంది మట్లకుంట కామేశ్వరరావు, ఉలవల మురళి,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube