ఆలయ రాజగోపురానికి అంటుకున్న మంటలు
టీ మీడియా, నవంబర్ 21, చెన్నై: తమిళనాడులోని శివకాశిలో ఆలయ రాజగోపురానికి మంటలు అంటుకున్నాయి. శివకాశిలోని విరుధునగర్‌లో ఉన్న భద్రకాళి అమ్మన్ ఆలయంలో పునర్‌నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాజగోపురం చుట్టూ కట్టెలతో ఓ నిర్మాణం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆదివారం రాత్రి ఆలయ సమీపంలో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ సందర్భంగా పటాకులు కాల్చడంతో అవి రాజగోపురానికి ఉన్న ఆ కట్టెల నిర్మాణంపై పడ్డాయి.దీంతో మంటలు అంటుకుని క్రమంగా కిందివరకు వచ్చాయి.
Also Read : నివాళులు అర్పించిన టీజేఎస్ నాయకులు
గుర్తించిన భక్తులు ఆలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పటాకులు పేల్చడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube