అదిరిపోయే ఫీచర్లతో రూ.3వేలకే స్మార్ట్‌ ఫోన్‌

అదిరిపోయే ఫీచర్లతో రూ.3వేలకే స్మార్ట్‌ ఫోన్‌

1
TMedia (Telugu News) :

అదిరిపోయే ఫీచర్లతో రూ.3వేలకే స్మార్ట్‌ ఫోన్‌
టి మీడియా,మార్చి11,న్యూఢిల్లీ:మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ సందర్భంగా స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు ఫ్లిప్‌ కార్ట్‌ బంపరాఫర్‌ ప్రకటించింది. రూ.16,099 ఖరీదైన స్మార్ట్‌ ఫోన్‌ ను కేవలం రూ.3,099కే అందిస‍్తున్నట్లు తెలిపింది. హోలీ పండుగ సందర్భంగా ఫ్లిప్‌ కార్ట్‌ మార్చి 12 నుంచి 16 వరకు ఈ సేల్ నిర్వహిస్తుంది. అంతకంటే ముందే రియల్‌ మీ 8 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 3 వేలకే కొనుగోలు చేయోచ్చని తెలిపింది.
రియల్‌ మీ 8 స్మార్ట్‌ ఫోన్‌పై ఆఫర్లు
దేశీయ మార్కెట్‌ ప్రకారం..4జీబీ ర్యామ్‌ ప్లస్‌ 128జీబీ స్టోరేజ్‌ రియల్‌ మీ 8 స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.16,099గా ఉంది. అయితే కొనుగోలు దారులు అతితక్కువ ధరకే సొంతం చేసుకునేలా బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఫ్లిప్‌ కార్ట్‌ అందుబాటులోకి తెచ్చింది.

Also Read : హైదరాబాద్‌లో ఇళ్లకు డిమాండ్‌

దీంతో ఈ ఫోన్‌ ధర ప్రస్తుతం మార్కెట్‌ ధర కంటే భారీగా తగ్గనుంది.
కొనుగోలు దారులు రియల్‌ మీ స్మార్ట్‌ ఫోన్‌ను ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. మీకు 5 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌తో ఫోన్‌ ధర వెయ్యి తగ్గుతుంది. దీని తర్వాత ఈ ఫోన్ రూ. 15,099 ధరకు అందుబాటులోకి వస్తుంది.ఇక మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా రూ.13000 డిస్కౌంట్‌ పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా మీ ఓల్డ్‌ స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే.. రియల్‌ మీ రూ.3వేలకే పొందవచ్చు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube