తుంగభద్రకు పోటెత్తిన వరద
-75, 843 క్యూసెక్కుల ఇన్ ఫ్లో 65 టీఎంసీలకు చేరుకున్న నీటినిల్వ
-ఈ నెల 12 నుంచి హెచ్ఎల్ సీకి, 15 నుంచి ఎల్ఎల్సీ కాలువకు నీరు విడుదల
టి మీడియా, జులై 9,ఉరవకొండ: తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతాలైన ఆగుంబె, మోరాళ, తీర్ధహళ్లి, శివ మొగ్గ తదితర చోట్ల కురుస్తున్న భారీ వర్షాలతో నదికి నీరు పోటెత్తుతోంది. టీబీ డ్యాంలోకి 75,843 క్యూసెక్కుల భారీ స్థాయిలో వరదనీరు వచ్చి చేరుతోంది. గురువారం ఒకే రోజు డ్యాంలోకి 6 టీఎంసీలకు పైగా నీరు చేరడంతో డ్యాంలో నీటి మట్టం 65 టీఎంసీలకు చేరింది. డ్యాం పూర్తి సామర్ధ్యం 101 టీఎంసీలు.
Also Read : ఒకేసారి ఒకటే ఫోన్ నంబర్
వస్తున్న వరదతో వారం లోపు డ్యాం పూర్తిస్థాయిలో నిండవచ్చని అధికారులు తెలిపారు. ఈ నెల 12 నుంచి హెచ్ఎల్ సీకి, 15 నుంచి ఎల్ఎల్సీ కాలువకు నీరు వదిలేందుకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. మరోవైపు హెచ్ఎల్సీ పరిధిలోని రైతులు పొలం పనుల్లో మునిగిపోయారు. కాలువలకు నీరు వదిలేలోపు పంటలను వేసు కోవడానికి సన్నద్ధమయ్యారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube