శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 21, శ్రీశైలం:

శ్రీశైల జలాశయానికి ఆదివారం వరద ప్రవాహం కొనసాగుతోంది వరద ప్రవాహం పెరగడంతో జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం ఇన్ఫ్లో 81,293 క్యూసెక్కులుగా కొనసాగుతుంది అని అధికారులు పేర్కొన్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 856 అడుగులుగా ఉంది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని జలాశయం అధికారులు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube