నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద

1
TMedia (Telugu News) :

నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద

టీ మీడియా, జూలై 26,నాగార్జున సాగర్‌: జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 57,669గా ఉన్నది. విద్యుత్‌ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 544.50 అడుగుల నీరుండగా.. పూర్తిస్థాయినీటిమట్టం 590 అడుగులు. సాగర్‌ డ్యామ్‌ గరిష్ఠస్థాయి 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 201.13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

 

Also Read : ఈడీ విచారణకు హాజరైన సోనియా గాంధీ

మరో వైపు ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖంపడుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 37,384క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రస్తుతం డ్యామ్‌ నుంచి అవుట్‌ ఫ్లో 69,317 క్యూసెక్కులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.10 అడుగులు ఉన్నది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. 19.8593టీఎంసీలు నిల్వ ఉన్నది. కుడి, ఎడమగట్లలో ఉన్న జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube