నాగార్జునసాగర్‌కు భారీ వరద.. 12 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్‌కు భారీ వరద.. 12 గేట్లు ఎత్తివేత

1
TMedia (Telugu News) :

నాగార్జునసాగర్‌కు భారీ వరద.. 12 గేట్లు ఎత్తివేత

టీ మీడియా,సెప్టెంబర్ 21, నల్లగొండ: నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో అధికారులు 12 గేట్లు 10 అడుగులమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,3,099 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లే విడుదల చేస్తున్నారు.

Also Read : పైలట్లకు షాకిచ్చిన స్పైస్‌జెట్‌

సాగర్‌ పూర్తిస్థాయి నీటమట్టం 590 అడుగు. ప్రస్తుతం 589 అడుగుల వద్ద ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ 312 టీఎంసీలు. ఇప్పుడు 309 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉన్నది. కుడి కాలువకు 10,200 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1795 క్యూసెక్కులు, ప్రధాన విద్యుత్‌ కేంద్రం ద్వారా 30,044 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube