శ్రీరాంసాగర్‌కు భారీగా వరద..
22 గేట్లు ఎత్తి నీటి విడుదల
టి మీడియా,జూలై19,నిజామాబాద్:భారీ వర్షాల కారణంగా నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. 22 గేట్లు ఎత్తేసి మరీ నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 90,190 క్యూసెక్కులుగా ఉండగా.. అవుట్‌ఫ్లో 95,952 క్యూసెక్కులుగా ఉంది.
Also Read : మధిర డిపోని పరిశీలించిన ఖమ్మం ఆర్ఎం ప్రభు లత
అలాగే శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1088 అడుగులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అలాగే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 76.424 టీఎంసీలు ఉంది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube