కాల్పుల కలకలం..టీడీపీ నాయకుడి పరిస్థితి
టీ మీడియా, ఫిబ్రవరి 2, పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో టీడీపీ కి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై గురువారం ఉదయం దుండగులు కాల్పులు జరిపారు. ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆయనపై రెండురౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. తూటాలు పొత్తికడుపులోకి దూసుకుపోవడంతో హుటాహుటినా ఆయనను నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రత్యర్థులు ఆయనపై కత్తులతో దాడులకు పాల్పడ్డారు. తాజాగా మరోసారి ఆయనపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కేసులో వైసీపీలో క్రియశీల సభ్యుడిగా పనిచేస్తున్న ఒంటిపులి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. గతంలో రెండుసార్లు రొంపిచర్ల ఎంపీపీగా పని చేసిన బాలకోటి రెడ్డి పనిచేశారు.