సీజనల్ జ్వరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
-మెడికల్ క్యాంపులో నున్నా
టీ మీడియా, ఆగస్టు 6,ఖమ్మం: జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఖమ్మం జిల్లాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న సీజనల్ జ్వరాలపై దృష్టి సారించి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా సిపిఎంపార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు . శనివారం సిపిఎంపార్టీ టూ టౌన్ కమిటీ, బివికే కమిటీ ఆధ్వర్యంలో మంచికంటి హల్ లో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా మందులు పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్ధాయి పి హెచ్ సిలలో డాక్టర్లలను, నర్సులను అందుబాటులో వుంచి తగిన మందులు వుండాలని డిమాండ్ చేశారు. ఎక్కడికి అక్కడ మండల కేంద్రంలో వైద్య సేవలకు కావలిసిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ప్రధానంగా మెడికల్ టెస్ట్ లు కూడా మండలం హెడ్ క్వార్టర్స్ లో ఉచితంగా చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : ప్రొఫెసర్ జయశంకర్ కి మంత్రి పువ్వాడ నివాళి
జిల్లా కేంద్రమైన ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీగా వున్న డాక్టర్ పోస్ట్ లను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో డబ్బులు అక్రమంగా వసూలుపై జిల్లా అధికారులు దృష్టి సారించాలి అని డిమాండ్ చేశారు. ప్రముఖ డాక్టర్లు డాక్టర్ హర్ష తేజ్, సి భారవి, కొల్లి అనుదీప్, జి రాజేష్, పి సుబ్బారావు, తదితర డాక్టర్లు రోగాలను పరిశీలన చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వై విక్రమ్, నాయకులు వై శ్రీనివాసరావు,నర్రా రమేష్, పి ఝాన్సీ, శివ నారయణ , జె వెంకన్న బాబు, రామారావు, వాసిరెడ్డి వీరభద్రం, నాగేశ్వరరావు, కె వెంకన్న తదితరులు పాల్గొన్నారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube