టీ మీడియా-చింతకాని
మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలోఫాగింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆలస్యం నాగమణి మాట్లాడుతూ దోమల నివారణ కొరకు ప్రతి రోజు ఫాగింగ్ నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. గ్రామ ప్రజలు మురికినీటిని నిల్వ ఉంచుకోకుండా సైడ్ కాలువ ద్వారా బయటకు పంపాలని నీరు నిల్వ ఉన్నచో కిరోసిన్ చుక్కలు వేసి దోమలను నివారించాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాహుల్,పంచాయతీ సిబ్బంది గోపి,కొండలరావు,నగేష్ రాజు,బుచ్చిబాబు, పద్మ తదితరులు పాల్గొన్నారు.