ఈ సూత్రాలను ఫాలో..యువత ఈజీగా సక్సెస్ అవుతారు

ఈ సూత్రాలను ఫాలో..యువత ఈజీగా సక్సెస్ అవుతారు

1
TMedia (Telugu News) :

ఈ సూత్రాలను ఫాలో..యువత ఈజీగా సక్సెస్ అవుతారు

లహరి, డిసెంబర్ 15, ప్రతినిధి : చరిత్రను పరిశీలిస్తే, గుప్తుల కాలంలో ఆచార్య చాణక్యుడు తన విధానాలతో 20 ఏళ్లలోపు కుర్రాడిని రాజుగా చేసి ఆ సామ్రాజ్యంలో సుస్థిర పాలనను విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. తత్వవేత్తగా, ఆర్థిక వేత్తగా, ఆచార్యునిగా కీర్తి, ప్రతిష్టలు పొందాడు. అంతేకాదు మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో కీలకమైన విషయాలను తను రచించిన గ్రంథాలలో పొందుపరిచాడు. తన చెప్పిన సూత్రాలు ప్రస్తుత తరానికిఎంతగానోఉపయోగపడుతున్నాయి.

ఈ సందర్భంగా యువత, విద్యార్థులు సక్సెస్ కావాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో స్పష్టంగా వివరించాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో అనేక విషయాలను వివరించారు. తన విధానాలను అనుసరించడం ద్వారా మనం ఏ సమస్య నుంచి అయినా సులభంగా బయటపడొచ్చు. అంతేకాకుండా ఆచార్య చాణక్యుడు యూత్ గురించి, విద్యార్థుల గురించి కూడా సవివరంగా వివరించారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనది. ఈ దశలో విద్యార్థులు, యువత చాలా సీరియస్ గా ఉండాలి. ఈ సమయంలో నిర్లక్ష్యం, చెడు సహవాసం, సోమరితనం వల్ల అత్యంత నష్టం కలిగే అవకాశం ఉంది. ఇక్కడ తప్పు చేయడం వల్ల మొత్తం జీవితంపై ప్రభావం పడుతుంది. అందుకే విద్యార్థులు, యువత తమ విద్య, జీవితం పట్ల అంకితభావంతో ఉండాలి. ఇదిలా ఉండగా.. చాణక్యుని విధానాలను అనుసరించడం వల్ల విద్యార్థులు, యువత తమ లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యూత్ సక్సెస్ కావాలంటే చాణక్యుడు చెప్పిన ఈ విధానాలను కచ్చితంగా పాటించాలి.

Also Read : చుట్టూ గన్స్‌.. మధ్యలో వాల్తేరు వీరయ్య కొత్త స్టైలిష్‌ లుక్‌

చాణక్య నీతి ప్రకారం, ఎవరైతే తమ జీవితంలో సక్సెస్ కావాలనుకుంటారో.. వారందరూ తమ పనులను సకాలంలో పూర్తి చేయాలి. అంటే ఏ పని మొదలుపెట్టినా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. ముఖ్యంగా యువత, విద్యార్థులు సమయానికి ప్రతి పనిని పూర్తి చేయాలి.ఏయే సమయాల్లో గురువులకు, భార్యకు, సోదరులకు దూరంగా ఉండాలంటే..విద్యార్థి దశలో ఉండే ప్రతి ఒక్కరూ చాలా క్రమశిక్షణతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా, సోమరితనంగా ఉండకూడదు. విద్యార్థులు, యువత ఎవరైతే క్రమశిక్షణతో ఉంటారో వారు విజయం సాధించేందుకు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. అలాంటి విద్యార్థులు, యువత సులభంగా తమ లక్ష్యాలను సాధిస్తారు.
చెడు సహవాసాలను నివారించాలి..
చాణక్య నీతి ప్రకారం, విద్యార్థులు, యువత ఎప్పటికీ తప్పుడు సహవాసాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అలాంటి అలవాట్లు మిమ్మల్ని నాశనం చేస్తుంది. యువతగా ఉన్న సమయంలో స్నేహితులతో సహవాసం చేయడం వల్ల మీ జీవితంపై గొప్ప ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితిలో విద్యార్థులు, యువత మంచి వ్యక్తులతో, నిజాయితీగా ఉండే వ్యక్తులతోనే స్నేహం చేయాలి.
బానిస కావొద్దు..
ఆచార్య చాణక్యుని ప్రకారం, విద్యార్థులు, యువత డ్రగ్స్ తదితర వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే చెడు అలవాట్లు విజయానికి ఆటంకం కలిగిస్తాయి. అదే సమయంలో ఇది శరీరం, మనసు, సంపదను నాశనం చేస్తుంది. అంతేకాకుండా మీకు గౌరవం కూడా తగ్గిపోవడమే కాదు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సోమరితనాన్ని వదులుకోవాలి..

Also Read : దర్శనం టికెట్ల కౌంటర్ ప్రారంభించిన జేఈవో

విద్యార్థులు, యువతకు సోమరితనమే పెద్ద శత్రువు అని చాణక్య నీతి శాస్త్రం వివరిస్తోంది. కాబట్టి మీరు సోమరితనాన్ని వదిలేయాలి. ముందుగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దాన్ని సాధించే దిశగా ప్రయత్నం చేయాలి.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని లహరి దృవీకరించడం లేదు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube