జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం

జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం

1
TMedia (Telugu News) :

జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం

 

టీ మీడియా, నవంబర్ 2, బెల్లంపల్లి : పట్టణం బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం 134 వ సారి బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. బుధవారం అన్నదాన కార్యక్రమం కొరకు దాత చిన్న భూదే గ్రామ వాస్తవ్యులు సింగతి అక్షర వర్మ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు సింగతి కవిత రవి కుమార్ దంపతులు సోదరుడు సింగతి అక్షయన్ వర్మ గార్లు యాచకులకి, నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకి ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమం లో సుమారు 180 మందికి అన్నదానం చేసారు.

Also Read : దుండగులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ఈ జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం విజయవంతం కొరకు మరింత మంది దాతలు ముందుకు రావాలని అలాగే సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల రమాదేవి, సహాయ కార్యదర్శి కరిష్మా కార్యవర్గ సభ్యులు బొలిశెట్టి సుధాకర్, బియ్యాల గణేష్, నిచ్చకొల గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube