పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి

పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి

0
TMedia (Telugu News) :

 

photo

 

పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి -కౌన్సిలర్ ఎర్రగుంట లక్ష్మీ రమేష్

టీ మీడియా, సెప్టెంబర్ 15, మధిర:గర్భిణీలు బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం తోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని 21వ వార్డు కౌన్సిలర్ ఎర్రగుంట లక్ష్మీ రమేష్ పేర్కొన్నారు. మధిర సెక్టార్ వన్ పరిధిలోని 10మినీ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికి అంగన్వాడీ కేంద్రాలలో బరువు, ఎత్తు, పోషక స్థాయిలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా తల్లులకు తక్కువ ఖర్చుతో పిల్లలకు అందించే పోషకాహార పదార్థాల గురించి అవగాహన కల్పించారు. లోప పోషణ ఉన్నటువంటి పిల్లలకు ఆకలి పరీక్షలను నిర్వహించాలన్నారు. గర్బిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె వివరించారు. పోషణ మాసం సందర్భంగా సెప్టెంబర్1వ తేదీ నుండి 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ జ్యోతి కుమారి అంగన్వాడీ టీచర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube