సి.సి రోడ్లను వెంటనే నిర్మించాలి

సి.సి రోడ్లను వెంటనే నిర్మించాలి

1
TMedia (Telugu News) :

సి.సి రోడ్లను వెంటనే నిర్మించాలి

టీ మీడియా,సెప్టెంబర్ 26,గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న 25 డివిజన్ లో రోడ్లను మంజూరు ఐన నిధులకు టెండర్ ప్రక్రియను ప్రారంభించి వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో కాలనీ వాసులతో కలిసి డివిజన్ పరిధిలోని రోడ్లను పరిశీలించి కార్పొరేషన్ తీరుపై నిరసన వ్యక్తం చేయడం జరిగిందని సిపిఐ సీనియర్ నాయకులు గౌతం గోవర్దన్, నగర కార్యదర్శి కే.కనకరాజ్ లు పేర్కొన్నారు. సోమవారం 25 డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీ లో కాలనీ వాసులతో కలిసి రోడ్లను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ 25 డివిజన్ లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, కాలనీ వాసులు ఇట్టి రోడ్లపై వెళ్ళే పరిస్థితి లేదని, ప్రమాదాల కు గురవుతున్నారని వారు తెలిపారు.

Also Read : బైక్ లాంచ్ చేసిన వైస్ చైర్మన్

ఈ విషయం లో ఎన్నో సార్లు కాలనీ వాసులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, మేయర్ కు వినతి పత్రాలు ఇచ్చినప్పటి కీ ఇంత వరకు రోడ్డు నిర్మాణం చేపట్టక పోవడం విచారకరమని వారు పేర్కొన్నారు.ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి ఈ డివిజన్ లో వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టెందుకు చర్యలు వారు డిమాండ్ చేశారు,లేనిచో సిపిఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమం లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, నగర సహాయ కార్యదర్శులు తాళ్ళపెల్లి మల్లయ్య,మద్దెల దినెష్, నాయకులు తొడుపునూరి రమేష్ కుమార్,జనగామ జగదీశ్వర్,ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కపూరి సూర్య, కాలనీ వాసులు ఆడెపు రాజలింగయ్య,మాదాసు రాజయ్య,లకుం కుమారస్వామి,దీకొండ లక్ష్మి నారాయణ,ఈసంపెల్లి వెంకన్న,శ్రీనివాస రెడ్డి, మొలుగూరి వీరయ్య,దుబాసి నర్సయ్య, కే.స్వామి,కాలనీ వాసులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube