స్మశాన వాటికకు దారి కనబడడం లేదు

స్మశాన వాటికకు దారి కనబడడం లేదు

1
TMedia (Telugu News) :

స్మశాన వాటికకు దారి కనబడడం లేదు

 

టీ మీడియా, అక్టోబర్ 10,తిరుమలాయపాలెం:తిరుమలాయపాలెం మండలం గోల్ తండా గ్రామం గోపాయి గూడెం లో ప్రజలు ఎవరైనా చనిపోయినప్పుడు స్మశాన వాటికకు తీసుకొని వెళ్లేటప్పుడు 50 సంవత్సరాలుగా ఉన్న దారి ఇప్పుడు నారాయణరెడ్డి మల్లారెడ్డి ఇద్దరూ దారిని మూసి వేయడం జరిగినది. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చనిపోయిన వ్యక్తిని తీసుకొని వెళ్లేటప్పుడు బాధలో ఉన్న వారికి దారి మూచిన నారాయణరెడ్డి మల్లారెడ్డి శవాన్ని ఆపి గొడవ చేస్తున్నారు. దీనిని అధికారులు గమనించి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం గోపాయగూడెంలో ఉన్న సమస్యను పరిష్కరించగలరని ప్రజలు విన్నపించుకుంటున్నారు.

Also Read : రావినూతల లో పర్యటించిన, ఎంపీ నామ

అలానే గోపాయిగూడెం ప్రజల విన్నపం మేరకు తిరుమలాయపాలెం బీఎస్పీ నాయకులు అక్కడికి వెళ్లి సమస్యను తెలుసుకున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యను పట్టించుకోవాలని అన్నారు సమస్యను పట్టించుకోని ఎడల మేము ధర్నాకు దిగుతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ నాయకులు పాలేరు నియోజకవర్గం అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ యాదవ్ , తిరుమలాయపాలెం మండల కన్వీనర్ ఎస్.కె చాంద్ పాషా, నవిలా బాబు, బిక్కు నాయక్, రమణ, వెంకన్న, కొలిచలం శ్రీనివాస్, వివిధ నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube