అడవి శాఖ అతిథి గృహస్థలం కాపాడాలి

అడవి శాఖ అతిథి గృహస్థలం కాపాడాలి

1
TMedia (Telugu News) :

అడవి శాఖ అతిథి గృహస్థలం కాపాడాలి

టి మీడియా, సెప్టెంబర్ 19, వనపర్తి బ్యూరో :వనపర్తి జిల్లా కేంద్రంలో పత్రికా సమావేశంలో సోమవారం ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా బస్ డిపో ముందు ఉన్న సర్వేనెంబర్ 1110, 1111,1112,1113 లలో ఒక నెంబర్లో ఉన్న అడవిశాఖ అతిధి గృహనికి సంబంధించి 1933లో అయ్యలూరి రఘునాథ శర్మ వారి కుటుంబం 10 గుంటల భూమిని రాజా రామేశ్వరావు సూచన మేరకు కేటాయించగా కొన్ని సంవత్సరాల పాటు 10 గుంటల భూమిలోనే అతిగృహం ముందు ఉండి విశాలంగా కాంపౌండ్ ఉన్నదని చెప్తున్నారు.1990 తర్వాత కొన్ని దొంగ రిజిస్ట్రేషన్లు, తర్వాత కొన్ని దొంగ రిజిస్ట్రేషన్లు ఏర్పాటు చేసుకోవడంతో మధ్యలో వచ్చిన ఒక ఆఫీసర్ దానిపై దృష్టి పెట్టడంతో పక్కనున్న స్థలాలకు అప్పటి ప్రజాప్రతినిధులతో దొంగ అనుమతులు తెప్పించుకోవడంతో ఆ ఆఫీసర్ తరువాత వచ్చిన 2014లో మిగిలి ఉన్న స్థలాన్ని మున్సిపాలిటీలో అనుమతులు ఇప్పించడం జరిగిందని తెలుస్తుంది.

Also Read : విద్యార్థులకు హెమోగ్లోబిన్ రక్త పరీక్షలు

ఆయా రిజిస్ట్రేషన్లలో ప్రజా ప్రతినిధుల సంతకాలతో పాటు, సాక్షుల సంతకంలో కూడా ప్రజాప్రతినిదులే ఉన్నారు.అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు అప్పటి ప్రజాప్రతినిదులు, అమ్మిన వారు, కొన్నవారు అందరూ ఒకే గూటికి చెందినవారే.ఒకరు బంధువులు అయితే ఇంకొకరు స్నేహితులు ఇంకొకరు భాగస్వాములు.అయితే ఇక్కడ ఒక సమాధానం దొరుకుతుంది ఎవరు అధికారంలో ఉంటే వారి ఎదుటివారు కలిసి చేసిన ఈ తత్తంగమంతా వనపర్తిలో ఉన్న ప్రభుత్వ భూములలో, మొత్తంలో జరుగుతున్నది.వెంటనే కలెక్టర్, మంత్రి,దీనిపై చర్యలు తీసుకొని అక్రమార్కుల నుండి ప్రభుత్వ భూమి అయిన అటవీశాఖ అతిధి గృహాన్ని దాని చుట్టూ ఉన్న స్థలాన్ని కాపాడాలని అక్రమార్కుల నుండి విడిపించాలని వనపర్తి ప్రజలు అఖిలపక్ష ఐక్యవేదిక కోరుకుంటున్నది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సతీష్ యాదవ్ తో పాటు వెంకటేష్, జయరాములు, నందిమల్ల చంద్రమౌళి, భాస్కర్, అడ్వకేట్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube