అటవీ శాఖ అతిథిగృహము అన్యాక్రాంతము

అటవీ శాఖ అతిథిగృహము అన్యాక్రాంతము

1
TMedia (Telugu News) :

అటవీ శాఖ అతిథిగృహము అన్యాక్రాంతము

టీ మీడియా, జులై 27, వనపర్తి బ్యూరో : వనపర్తి నడిబొడ్డున ఉన్న అడవిశాఖ అతిథి గృహం అన్యాక్రాంతం అయినందున ఉన్న స్థలాన్ని ఆక్రమించుకున్న స్థలాన్ని కాపాడండి అని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాల క్రితం వనపర్తి పట్టణంలోని బస్ డిపో ఎదురుగా ఉన్న ఫారెస్ట్ ఆఫిసు కాలక్రమేనా కొందరి స్వార్ధపరుల ఆక్రమణతో, కూచించుకపోవడంతో, ఉన్న స్థలాన్ని కాపాడాలని 1998లో ఒక రేంజ్ ఆఫీసర్ అప్పుటి ప్రజా ప్రతినిధులను ఎదిరించి ఉన్న స్థలాన్ని రక్షించాలనే ఉద్దేశంతో దాన్ని మున్సిపాలిటీలో రిజిస్టర్ చేయించారు. ఆ స్థలానికి మున్సిపాలిటీ వారు ఇంటి నెంబర్ కూడా కేటాయించారు. మున్సిపాలిలో రిజిస్టర్ చేయించిన స్థలాన్ని కూడా అక్రమార్కులు ఆక్రమించుకున్నారు. 40-33 గల నెంబరు తో ఉన్న ఈ ప్రదేశము 37×26 కట్టిన ప్రదేశము 24/5 ×25 స్థలంలో మాత్రము పెంకుటిల్లు కలదు. మిగతా స్థలాన్ని చుట్టుపక్కల వారు ఇల్లు కట్టుకున్నారని తెలుస్తుంది. ఈ ఆక్రమంలో అప్పటి ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా ఉండి తమవారికి కట్టబెట్టారని వాదన ఉంది.

 

Also Read : nఆర్కే బీచ్ వివాహిత మిస్సింగ్ ట్విస్ట్

వనపర్తి లో ఉన్న గ్రామకంఠలు, ప్రభుత్వ భూములు, రక్షించాలని అఖిలపక్ష ఐక్యవేదిక పలు దఫాలుగా కోరుతున్నా రెవెన్యూ అధికారులు గానీ ప్రభుత్వ అధికారులు గానీ పట్టించుకోకుండా ఆక్రమణదారులు ఇచ్చే డబ్బుకు ఆశపడి వాటిని రక్షించడం లేదు.ఎవరు ఎంతగా ఆక్రమించుకున్నా ప్రభుత్వఅధికారులను, ఆక్రమించుకున్న అక్రమార్కులను వదిలేది లేదని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ హెచ్చరించారు.బస్ డిపో ముందు ఉన్న అటవీ శాఖ భవనాన్ని వెంటనే రిపేరు చేసి అటవీ శాఖ అధికారులకు నివాస గృహంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజల కోరుకుంటున్నారు. కనుక జిల్లా కలెక్టర్ ,వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి దీనిపై దృష్టి సారించి ఆక్రమించిన స్థలాన్ని స్వాదీనం చేసుకొని అటవిశాఖ అతిథి గృహాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నది. అంతేకాక బస్ డిపో చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములు, గ్రామకంఠాలను కూడా స్వాధీనం చేసుకోవాలని ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, కోకన్వీనర్ చిరంజీవి, ఉపాధ్యక్షులు వెంకటేష్, కార్యదర్శులు రాజనగరం రాజేష్, రమేష్, బల్మూరు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube