మన్యంలో మావోయిస్టుల అలజడి

ప్రైవేట్ బస్సును దగ్ధం

1
TMedia (Telugu News) :

tmedia MAIN 25-4-2022

 

మన్యంలో మావోయిస్టుల అలజడి.
– ప్రైవేట్ బస్సును దగ్ధం

టి మీడియా, ఏప్రిల్ 25,చింతూరు:

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం సర్వేల జాతీయ రహదారి 30. కొత్తూరు గ్రామాల మధ్య ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులు ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఒక ప్రైవేటు బస్సు ను అడ్డగించి ఆయిల్ పోసి నిప్పంటించారు. ఒరిస్సా రాష్ట్రంలోని జైపూర్ నుండి హైదరాబాదుకు వెళుతున్నా కె.వి.ఆర్ బాబు బస్ ట్రావెల్స్ అర్థ రాత్రి 12 గంటల సమయంలో కొత్తూరు సర్వేల గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అడ్డగించి బస్సులోని ప్రయాణికులను తొందరగా దిగాలని ఆదేశించారు. ప్రయాణికులు ఈ హఠాత్పరిణామానికి గురై దిగేందుకు కొంత ఆలోచన చేయడంతో మావోయిస్టుల హెచ్చరికలు చేసి బస్సును తగలబెడతాం అనడంతో ప్రయాణికుల్లో అలజడి మొదలైంది. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా బస్సు దిగేందుకు చేసిన ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో రజనీ పాల్ అనే ఒక వృద్ద మహిళ బస్సు దిగి లేక బస్సులోనే ఉండిపోవడంతో చీకటి కావటంతో అది గ్రహించక మావోయిస్టులు ఆయిల్ పోసి బస్సును తగలబెట్టారు. బస్సులో ఉన్న వృద్ధ మహిళ మంటల్లో చిక్కుకుంది. తోటి ప్రయాణికులు వృద్ధ మహిళలను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.

Also Read : పార్టీలు మారే పరిస్థితులు వచ్చాయి…. నేను పదవులు కోసం పార్టీలు మారలేదు…

చికిత్స కొరకు చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాలిన గాయాలతో మహిళా ప్రాణాలతో బయట పడింది. సమాచారం పోలీసులకు చేరడంతో ప్రయాణికులను చింతూరు కు తరలించారు. భద్రాచలం నుండి చింతూరు కి వచ్చే బైక్ ప్రయాణికులు బస్సు మంటల్లో కాలి పోవడం చూసి భయపడి సర్వేల గ్రామంలోనే తలదాచుకున్నారు. అనంతరం మావోయిస్టు కరపత్రాలను చెట్లకు అంటించి రోడ్డుపై వదిలారు. కరపత్రాల సారాంశం ఏమిటంటే దక్షిణ బస్తర్ జిల్లాలో ఇటీవల పోలీసులు డ్రోన్ బాంబులను ఆదివాసి గ్రామాలపై దాడి చేస్తున్నారని. వెంటనే డ్రోన్ బాంబులను నిలుపుదల చేయాలని. కామ్రేడ్ నర్మదా అక్క 25వ స్మృతి వారోత్సవాలను జరపాలని, భారత ప్రభుత్వం ఆదివాసి గ్రామాలపై పోలీసు బలగాల దాడులను నిలుపుదల చేయాలని కరపత్రం లో పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎటపాక ఏ ఎస్ పి జి కృష్ణ కాంత్, సీఐ గజేంద్ర కుమార్, చింతూరు సిఐ అప్పలనాయుడు. ఎస్ఐ యాదగిరి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బస్సు ఒడిస్సా రాష్ట్రానికి చెందినటువంటి సి. జి. కె. ఎస్.9895. కాగా బస్సు డ్రైవర్ ప్రశాంత్ బహదూర్.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube