గిరిజన విలేకరి పై అటవీశాఖ అధికారి దాడి

అట్టుడికిన నియోజకవర్గ కేంద్రం

1
TMedia (Telugu News) :

గిరిజన విలేకరి పై అటవీశాఖ అధికారి దాడి

అట్టుడికిన నియోజకవర్గ కేంద్రం

టీ మీడియా, సెప్టెంబర్ 29 ,అశ్వారావుపేట : అసలే గిరిజన జిల్లా అందులోను గిరిజన నియోజకవర్గం పొడు సమస్య అధికంగా ఉన్నా మండలం అశ్వారావుపేట. అటవీశాఖ అధికారులకు పొడు సాగుదారులకు నిత్యం గొడవలు జరగటం సర్వసాధారణం అయిపోయాయి.ఈ మధ్య అటవీశాఖ అధికారులు గిరిజనుల పై పాశవికంగా దాడులు కూడా చేస్తున్న నేపథ్యంలో బుధవారం వాగొడ్డుగూడెం గ్రామంలో గిరిజనులకు అటవీశాఖ అధికారుల కు మధ్య పొడు వివాదం జరుగుతున్న నేపథ్యంలో వార్త సేకరించడానికి వెళ్లిన మీడియా పై సంపత్ అనే అటవీశాఖ అధికారి మీడియా ప్రతినిధులపై పరుష పదజాలం తో దూషిస్తూ సెల్ ఫోన్ లాక్కుని, కిందపడేసి మీడియా అంతూ చూస్తా అని బెదిరించటంతో దాడి చేసిన అధికారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో మీడియా ప్రతినిధులు పిర్యాదు చేసారు.

Also Read : రామ్‌కో సిమెంట్ కంపెనీని ప్రారంభించిన సీఎం జగన్

ఇప్పటకే ఆ అధికారిపై పలు కేసులు ఉన్నాయని అటువంటి అధికారులు పై చర్యలు తీసుకోకపోతే మొత్తం అటవీశాఖ కు మచ్చ అని అన్నారు. అనంతరం జాతీయ రహదారి పై అటవీశాఖ అధికారులు జులుం నశించాలని,దాడి చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రెస్ క్లబ్ ల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.అటవీశాఖ అధికారులు ఆఖరికి మీడియా పై కూడా దాడులు చేస్తున్నారా అని ఇంకా గిరిజనులను ఎందుకు ఉపేక్షిస్తారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు మట్లకుంట చంద్రశేఖర్,తోకల హరీష్,బమ్మిది మోహన్,రాఘవేంద్ర తో పాటు 70మంది విలేకరుల ధర్నాలో పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube