ఆర్థిక సహాయం చేసిన మాజీ ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 10 వనపర్తి : వనపర్తి పట్టణంలో చేయూత ఆశ్రమానికి చెందిన స్వప్న వివాహం సందర్భంగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆశ్రమాన్ని సందర్శించి విద్యార్థుల యోగక్షేమాలు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. చేయూత ఆశ్రమమునకు అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. ఆశ్రమంలోని స్వప్న వివాహం సందర్భంగా ఆమెను ఆశీర్వదించి చీర సారె అందించి పదివేల రూపాయల నగదు అందించారు. నిర్వాహకుల శ్రీనివాస్ రెడ్డి చెన్నరాయుడు మాట్లాడుతూ రావుల ఆశ్రమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. గతంలో పద్మ వివాహం జరిగినప్పుడు కూడా ఆర్థికంగా సహాయపడాలని ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా మాకు అండగా ఉన్నారని అన్నారు. వారికి చేయూత తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి అధ్యక్షుడు నందిమల్ల అశోక్ మాట్లాడుతూ రావుల రాజకీయాలకతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచారని అదేసమయంలో కరోన సందర్భంగా దాదాపు ఆరువేల మందికి ఆర్థిక సహాయం అందించారని అన్నారు. అనేక సేవా కార్యక్రమాలకు ఉదారంగా ఆర్థిక సహాయం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు వెంకటయ్య యాదవ్, బాలు నాయుడు, ముద్దు సార్ ,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Former MLA Raula Chandrasekhar Reddy on Friday visited the ashram of Cheyuta Ashram in Vanaparthi town.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube