టీ మీడియా వనపర్తి అక్టోబర్ 30 : దివంగత మాజీ ఎమ్మెల్యే జయరాములు విగ్రహం స్థాపించాలని శనివారం అఖిలపక్ష నాయకులు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వనపర్తిలో ప్రజలమధ్య ఉంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ సొంత డబ్బులతో ప్రజలను సెక్రటేరియట్ కు తీసుకు వెళ్లి వారి వారి పనులను చేస్తూ ప్రజల మన్ననలు పొందిన ప్రజల మనిషి పేద ఎమ్మెల్యే జయరాములు విగ్రహం ఇంతవరకు నెలకొల్ప కపోవడం సిగ్గుచేటు దీన్ని ప్రజలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. వారి గొంతుకను ప్రజాసంఘాలు ప్రతిపక్షాలు మీ ముందుకు తేస్తున్నాయి కనుక వెంటనే మున్సిపాలిటీలో తీర్మానం చేయాలని అలాగే మాజీ ఎమ్మెల్యేలు అయ్యప్ప మిగతా ఎమ్మెల్యేల విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరుతూ అలాగే మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలను వెలికి తీయాలని అఖిలపక్ష నాయకులు కోరారు.
ఈ సందర్భంగా ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో అదనపు కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడానికి వస్తే కలెక్టర్ అందుబాటులో లేకపోవడం వలన మున్సిపల్ కమిషనర్ కి మరియు మున్సిపల్ చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం అక్కడి నుండి కలెక్టర్ ఆఫీస్ కు వెళ్లి ఈవో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, వైఎస్ఆర్ టి.పీ నాయకులు వెంకటేష్, జయరాములు ,భాస్కర్ తదితరులు పాల్గొనగా వారికి మద్దతుగా టిడిపి కౌన్సిలర్ భర్త తెలుగు యువత నాయకులు రవి యాదవ్, బిజెపి నాయకులు పరుశురాం, 21 వ వార్డు కౌన్సిలర్ వెంకటేష్, బ్రహ్మం మద్దతు తెలిపారు వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
