రైతు-కూలీ సంఘంరాష్ట్ర సహాయ కార్యదర్శిగా బజ్జూరి వెంకట్రాంరెడ్డి

రైతు-కూలీ సంఘంరాష్ట్ర సహాయ కార్యదర్శిగా బజ్జూరి.వెంకట్రాంరెడ్డి

1
TMedia (Telugu News) :

రైతు-కూలీ సంఘంరాష్ట్ర సహాయ కార్యదర్శిగా బజ్జూరి.వెంకట్రాంరెడ్డి
టీ మీడియా,మార్చి 20,కూసుమంచి:నిజామాబాద్ లో జరిగిన, అఖిలభారత రైతు-కూలీ సంఘంతెలంగాణ రాష్ట్ర నిర్మాణ జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి,ఎన్నిక జరిగినది.ఈ ఎన్నికలో ఖమ్మం,జిల్లా నుండి రాష్ట్ర ,సహాయ కార్యదర్శి గా కామ్రేడ్ బజ్జూరి. వెంకట్రాంరెడ్డి ఎన్నుకున్నారు. గత 20 సంవత్సరాల నుండి మొదలు పార్టీకి విధేయునిగా వుంటూ,తన అకుంఠిత దీక్షా బలంతో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఆర్థిక ఇబ్బందులను అధిగమించి శత్రువు దాడులను ఎదుర్కొంటూఎన్ని నష్టాలు జరిగిన వెనకడుగు వేయకుండ,ఉద్యమాలను నిర్వహిస్తూ,ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ,పార్టీకి-ప్రజలకు అతీతునిగా,ఉద్యమ పంథాకు చిరునామాగా నిలిచి,నిరంతరం కాలే కొలిమిలో నిగ్గుతేలిన ఉక్కు ముక్కలా తాను పోరాడిన సమసమాజ సంకల్పాన్ని గుర్తించి,అసలైన మనిషికి సిసలైన స్థాన గౌరవంలో భాగంగా ఆయనకీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగాఎన్నుకోవటం ఎంతైనా ఆనంద దాయకం,, పార్టీ ప్రస్తుత కూసుమంచి టు నేలకొండపల్లి ముదిగొండ మండల కార్యదర్శిగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ నాయకుడిగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు రాష్ట్ర సహాయ,కార్యదర్శిగా,అంచెలంచెలుగా అంచంచలంగా సాగుతున్న అతని ప్రస్థానం ప్రశంసనీయం.ఈసందర్భంగా ఆయన ఈ సమావేశంలో మాట్లాడుతూ:- గత 20 సంవత్సరాల నుండి స్వాతంత్య్రావనిలో రైతు-కూలీలు ఇంకా పడరాని పాట్లు పడుతున్నారని,ప్రభుత్వాల కపట,కర్కశ విధానాలకు దేశానికి తిండి పెట్టే రైతులు,కొడవలి పట్టిన కూలీలు ఇంకా బలవన్మరణాలకు పాల్పడుతున్నారని,కర్షక-కార్మికుల శ్రమ దోపడీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అగ్రస్థాయిన తానుండి,వారి హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం జరుపటం తన లక్ష్యమని,పార్టీ తనపై ఉంచిన గురుతర బాధ్యతను స్వీకరిస్తూ,గుర్తెరిగి మరో ప్రజాస్వామిక పోరాటానికి సిద్ధమవుతానని ప్రకటించారు.

Also Read : అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిఘా

వీరి పట్టుదల ను అంకితమైన దీక్షను అభినందిస్తూ ఐ ఎఫ్ యు తరుపు నుండి ఐ.వెంకన్న కూసుమంచి నుండి ఐఎఫ్టియు మండల అధ్యక్ష కార్యదర్శులుగోపి రవి కనకం గోపాల్,అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు మాతంగి రామస్వామి రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి చెరుకుపల్లి వీరయ్య,డివిజన్ నాయకులు కృష్ణ నరేష్ సి ఎల్ సి జిల్లా నాయకులు .భార్గవ్,అభినందనలు తెలియజేశారు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేలకొండపల్లి ముదిగొండ మండల కమిటీలు సంపూర్ణంగా మనస్పూర్తిగా అభినందనలు తెలియజేశారు ప్రజా ఉద్యమాలను మరింతగా బలోపేతం చేసి ముందుకు తీసుకుపోవాలని,మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube