జాతీయ రహదారిని దిగ్బంధించిన వరంగల్ రైతులు

జాతీయ రహదారిని దిగ్బంధించిన వరంగల్ రైతులు

2
TMedia (Telugu News) :

జాతీయ రహదారిని దిగ్బంధించిన వరంగల్ రైతులు
టి మీడియా, మే26,వరంగల్:

భూసేకరణ జీవో 80-ఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. వరంగల్‌ జిల్లా రైతులు బుధవారం హనుమకొండ- హైదరాబాద్ 163 జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ మేరకు ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు. జీవోను వెంటనే రద్దు చేయాలని రైతులు నినాదాలు చేశారు.

Also Read : విద్యార్థి ఆదృశ్యం

రైతుల నిరసనలో వామపక్ష నేతలు, కాంగ్రెస్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ ధర్నాతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు.ఇదిలా ఉండగా బుధవారం ఉదయం నుండి రైతులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే ఈ అరెస్టులను రైతుఐక్య కార్యాచరణ తీవ్రంగా ఖండించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube