దుబ్బాక రైతులకు ఎంపీ నామ ఆతిధ్యం.
-పామాయిల్ సాగు పరిశీలన
టీ మీడియా, మార్చి 09,ఖమ్మం:
మెదక్ జిల్లా, దుబ్బాక మండల రైతులకు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు క్యాంప్ కార్యాలయ సిబ్బంది ఆతిధ్యం ఇచ్చారు..బుధవారం నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా సాగు చేస్తున్న పామాయిల్ పంట పరిశీలనకు దుబ్బాక మండల ప్రజాప్రతినిధులు, రైతులు ఖమ్మం చేరుకున్నారు. కాగా తమ రైతులు ఖమ్మం జిల్లాకు వస్తున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కు ఫోన్ ద్వారా తెలియజేయగా ఆయన ఆదేశాలతో ఖమ్మం లో ఎంపీ క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ కనకమేడల సత్యనారాయణ మరియు సిబ్బంది ఆ రైతులకు స్వాగతం పలికి క్యాంప్ కార్యాలయంలో బోజనాలను ఏర్పాటు చేశారు అనంతరం జిల్లా రైతు బంధు కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు రైతుల బృందాన్ని అశ్వారావుపేట లోని పామాయిల్ పంట సాగు పరిశీలనకు తీసుకువెళ్లారు.
Also Read : బిజెపి అంటే కెసిఆర్ కు వణుకు
అక్కడ వారు పామాయిల్ పంట సాగు తో పాటుగా అప్పారావుపేట లోని పామాయిల్ ఫ్యాక్టరీ సందర్శించారు ఈ సందర్భంగా వారు ఎంపీ నామ నాగేశ్వరరావు కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు .దుబ్బాక నుండి వచ్చిన వారిలో దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి శ్రీలేఖ రాజు, మున్సిపల్ చైర్మన్ గన్నే వనిత బూమిరెడ్డి, ఎంపీపీ పుష్పలత కిషన్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు కైలాష్ ,రైతు బంధు మండల కన్వీనర్ వంగా బాల్ రెడ్డి, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షుడు రాజయ్య, పలువురు రైతు నాయకులు, రైతులు ఉన్నారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube