రాశి సీడ్స్ పత్తి పంట పై రైతు సంవృద్ధి సదస్సు

రాశి సీడ్స్ పత్తి పంట పై రైతు సంవృద్ధి సదస్సు

1
TMedia (Telugu News) :

రాశి సీడ్స్ పత్తి పంట పై రైతు సంవృద్ధి సదస్సు

టీ మీడియా, ఏప్రిల్21,మధిర:రాశి సీడ్స్ వారి రైతు సమృద్ధి సదస్సు మధిర మధిర గ్రామం మరియు మండలం నందు రాశి సీడ్స్ వారు పత్తి పంట పై రైతు సంవృద్ధి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాశి సీడ్స్ రీజినల్ క్రాఫ్ మేనేజర్ వెంకటేశ్వరరావు మరియు రీజనల్ బ్రాంచ్ మేనేజర్ సాయి చందు విచ్చేసి వారు మాట్లాడుతూ పత్తి పంటను ఆశించే పురుగులు తెగుళ్ళు వాటి నష్ట నివారణ చర్యలు పైన అవగాహన కల్పించారు.

Also Read : సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఈటల రాజేందర్

అలాగే నేల స్వభావాన్ని బట్టి విత్తనములు ఎంపిక చేసుకోవాలని చెప్పారు మరియు సూక్ష్మ పోషకాల ప్రాధాన్యత, గులాబి రంగు పురుగు నియంత్రణ చర్యల గురించి వివరించారు. ఇందులో భాగంగా రాశి సీడ్స్ వారి నూతన పత్తి రకం రాశి ప్రైమ్ ను రైతుల సమక్షంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మధిర మండలం మరియు పరిసర గ్రామాల నుండి సుమారుగా 350 మంది రైతులు, ఏరియా బిజినెస్ మేనేజర్ రమణ కుమార్ , కంపెనీ సిబ్బంది రమేష్, బాలకోట రెడ్డి ,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube