కాంగ్రెస్తోనే రైతు సమస్యలకు పరిష్కారం

-మోడీ, కేసీఆర్ లు రైతుల ద్రోహులు

0
TMedia (Telugu News) :

కాంగ్రెస్తోనే రైతు సమస్యలకు పరిష్కారం

-మోడీ, కేసీఆర్ లు రైతుల ద్రోహులు

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య

టీ మీడియా, ఏప్రిల్ 14, మధిర: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. భట్టి విక్రమర్క లాంటి ప్రజల నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమని కొనియాడారు. మధిర ప్రజలు అందరూ భట్టి విక్రమార్కకి పూర్తి స్థాయిలో అండగా ఉండాలని కోరారు. రాబోవు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నత పదవిలో మీరు భట్టి విక్రమార్కని చూస్తారని వెల్లడించారు. బుధవారం బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామం లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు స్వాగతం పలికి ఎమ్మెల్యే వీరయ్య సంఘీభావం ప్రకటించారు. భద్రాచలం నుంచి సుమారుగా 200 మంది కార్యకర్తలు పాదయాత్ర వద్దకు వచ్చి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భట్టి విక్రమార్కను కలిసి తమ మద్దతును తెలిపారు.

Also Read;ప్రాణహిత పుష్కారాలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లి లో జరిగిన సభలో వీరయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఆడుతున్న రాజకీయ డ్రామాలపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అని, రైతు ద్రోహులని ధ్వజమెత్తారు. “ప్రజలు అందరూ బాగుండాలి,అన్ని సమస్యలకూ పరిష్కారం కావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి “రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని వివరించారు. గతంలో ఎందరో ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్సార్ లు ప్రజలను నేరుగా కలిసే వారని, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ్యులను సైతం కలవడం లేదని విమర్శించారు. ప్రజలని కలవని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండటం అవసరమా అని ప్రశ్నించారు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి కేసీఆర్ ను శాశ్వతంగా ఫామ్ హౌస్ కి పరిమితం చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.

Also Read;ప్రతిభగల విద్యార్థికి సన్మానం

 

పొడు భూములు సమస్యలను ఇప్పటికే చాలాసార్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసెంబ్లీ లో గల వినిపించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో భాగంగా దుమ్మగూడెం లో భారీ బహిరంగ సభ ను భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రకటించారు. సంఘీభావం తెలిపిన వారిలో భద్రాచలం కాంగ్రెస్ జిల్లా నాయకులు చెన్నకేశవరావు, కొమ్మ రాంబాబు, జెడ్పిటిసి సున్నం నాగమణి, అంజున్ ,పాండు, మలగిరి కృష్ణ, సత్య వరపు బాలయ్య, పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కన్వీనర్ బుల్లెట్ బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు, జెడ్పిటిసి సుధీర్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కిషోర్, మండలాధ్యక్షుడు దుర్గారావు, తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube