హాట్‌టాపిక్‌గా ఫామ్‌హౌజ్‌ ఘటనలో ఆడియో

-ఊహించని మలుపులు

1
TMedia (Telugu News) :

హాట్‌టాపిక్‌గా ఫామ్‌హౌజ్‌ ఘటనలో ఆడియో

-ఊహించని మలుపులు

టీ మీడియా,అక్టోబరు28,హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కోనుగొలు కుట్ర ఎపిసోడ్‌ హాట్‌టాపిక్‌గా మారింది. రెండు రోజుల నుంచి ఈ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. అధికార టీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ రగడ రాజేస్తుంది. నువ్వా-నేనా అంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి కాలుదువ్వుతున్నారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ ఘటనలో తాజాగా ఓ ఆడియో బయటకొచ్చింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, స్వామిజీ రామచంద్ర భారతి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఫామ్‌హౌజ్‌ మీటింగ్‌కు ముందు రామచంద్రభారతితో రోహిత్‌ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు.

ఫోన్‌ సంభాషణ

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: ప్రస్తుతం మేం ముగ్గురం రెడీగా ఉన్నాం.

స్వామిజీ: మీరు నెంబర్‌-2 ముందు ఎమ్మెల్యేల పేర్లు చెబుతారా

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: నెంబర్‌ 2 ముందు పేర్లు చెబుతాను.ఈ విషయం బయటపడితే మా పని అయిపోతుంది

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: మా సీఎం గురించి మీకు తెలుసు కదా.. ఆయన చాలా దూకుడుగా ఉంటారు.

ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి: ప్రస్తుతం మేము ముగ్గురం రెడీగా ఉన్నం.

స్వామిజీ: నెంబర్‌-1, నెంబర్‌-2.. బీఎల్‌ సంతోష్‌ ఇంటికి వచ్చి అన్నింటిపై చర్చిస్తారు.

స్వామిజీ: బీఎల్‌ సంతోష్‌ మా ఆర్గనైనజింగ్‌ సెక్రటరీ.. ప్రభుత్వ ఏర్పాట్లన్నీ ఆయనే చూస్తారు.ఏ నిర్ణయమైనా బీఎల్‌ సంతోషే తీసుకుంటారు.

స్వామిజీ: సంతోష్‌తో కలిసి మనం నెంబర్‌-2 దగ్గరకు వెళదాం.

స్వామిజీ: ఒకరిద్దరు ముందుగా వస్తే బాగుంటుంది.

ఒకే దేశం, ఒకే యూనిఫాం: ప్రధాని మోదీ

స్వామిజీ: 25న గ్రహణం ఉంది కాబట్టి.. ఆతర్వాత కలుద్దాం.

స్వామిజీ: మీరు నెంబర్‌-2 ముందు ఎమ్మెల్యేల పేర్లు చెబుతారా

స్వామిజీ: 26 తర్వాత ఎక్కడైనాక కలుద్దాం.. హైదరాబాద్‌లో మాత్రం వద్దు.

స్వామిజీ: నేను డైరెక్టుగా బీఎల్‌ సంతోష్‌తోనే మాట్లాడతా.. మధ్యవర్తులు ఎవరూ లేరు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube