టీ మీడియా ,మే 8, చింతూరు: లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పడి 48 ఏళ్ళు అయిన సందర్భంగా పైలాన్ (విజయోత్సవ స్తూపం) నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. మనబడి పండుగ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించడానికి పూర్వ ఉపాధ్యాయులు ఆలపాటి అంకుప్రసాద్ దంపతులు పూర్వ విద్యార్థిని, విద్యార్థులు,నిర్వాహక కమిటీ సభ్యులతో నిర్వహించారు.ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు అంకుప్రసాద్ మాట్లాడుతూ జూన్ నెల మొదటి వారంలో జారుపబోయే స్వర్ణోత్సవ వేడుకల కార్యక్రమానికి 1974 నుండి 2022 వరకు ఈ పాఠశాల లో చదివిన ప్రతి ఒక విద్యార్థి,విద్యార్థిని లు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు.పైలాన్ నిర్మాణం కోసం ఇనపనూరి సుధీర్ వారి తల్లిదండ్రులు స్వర్గీయ వి డి ఒ ఆదాం, టీచర్ సరోజిని జ్ఞాపకార్థం తొలివిడత గా లక్ష రూపాయలు విరాళం ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో హేడ్మాస్టర్ తుర్రం లక్ష్మయ్య, విద్యా కమీటీ చైర్మన్ యం.డి. జిక్రియా ,కసిని.భాస్కర్ రావు,ఐ. వి.నరసింహా రావు,ఇనపనూరి. సుధీర్,పొదిలి.రామారావు,యం. డి.ముంతాజ్,తివారి.మధుసూదన్ రావు,యస్.ఎ. అసిఫ్,మేరీ, ఆశీర్వాదం,కె.యస్.యన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్దులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం కు ఐ.సుధీర్ లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది.
సరోజిని పంతులమ్మ గారి అబ్బాయి వారి అమ్మ గారి జ్ఞానపకర్ధం ఇవ్వడం జరగింది.