అయ్యో.. తల్లి రేణుకా..!

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

2
TMedia (Telugu News) :

అయ్యో.. తల్లి రేణుకా..!
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
-ఐదు రోజులకే మొహం చాటేశాడు
-పెళ్ల చేసుకొని మోసం

టి మీడియా,జులై 5,మహబూబ్ నగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని మోసం చేశాడో వ్యక్తి. ఐదు రోజులు తన కామ వాంఛలు తీర్చుకొని ఇప్పుడు ముఖం చాటేశాడు ఓ ప్రభుద్దుడు. తనకు న్యాయం చేయాలని బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడంతో పాటు జిల్లా ఎస్పీకి మొరపెట్టుకుంది. న్యాయం కావాలని పోలీస్ స్టేషన్ కు తిరిగి వెళ్తే.. ఎస్పీ వద్దకే వెళ్లాలి తాను ఏం చేయలేనని చేతులెత్తేశాడు సదరు ఎస్ఐ..! ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సదరు యువతీ న్యాయం కోసం తను ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడి ఇంటిముందు న్యాయపోరాటానికి ఉపక్రమించింది. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం దేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.దేపల్లి గ్రామానికి చెందిన మల్కాపురం సత్యనారాయణ గౌడ్ (23) ను అదే గ్రామానికి చెందిన పిట్టల రేణుక ముదిరాజ్ (21) ప్రేమించింది. ఒకే గ్రామానికి చెందిన ఇరువురు చిన్నప్పటినుండి అన్యోన్యంగా కలిసి తిరిగినట్లు బాధితురాలు రేణుక మీడియాకు వివరించింది. గత 8 ఏళ్లుగా చిన్నతనం నుండి ఒకరంటే ఒకరికి ఇష్టంగా పెరిగినట్టు బాధితురాలు పేర్కొంది. అయితే జూన్ 17న మల్కాపురం సత్యనారాయణ గౌడ్ రేణుకను హైదరాబాద్ ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నాడు. అగ్నిసాక్షిగా తాళి కట్టి తలంబ్రాలు పోశాడు. నువ్వు లేనిదే నేను లేను అని నమ్మించాడు. పెళ్లి జరిగిన ఐదు రోజుల వరకు తనతో బాగానే ఉన్నాడు. ఆ తర్వాత తన మోజు తీరాక సత్యనారాయణ గౌడ్ రేణుకను వదిలి వెళ్ళిపోయాడు.

 

Also Read : వయసు 54 మేకప్ తో 30 ఏళ్లలా మేనేజ్ చేసి పెళ్లి

 

సత్యనారాయణ గౌడ్ తండ్రికి ఆరోగ్యం బాగోలేదంటూ తన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని నమ్మించి రేణుకను వదిలేసి వెళ్లాడు. అప్పటినుండి ఇప్పటిదాకా రేణుక.. సత్యనారాయణ గౌడ్ కోసం ఎదురుచూసింది. చివరకు అతను మోసం చేశాడని తెలుసుకొని నవాబుపేట పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. అక్కడ ఫిర్యాదు చేసిన అనంతరం మళ్లీ మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసింది. అయితే నవాబుపేట ఎస్సై మాత్రం మళ్ళీ ఎస్పీ వద్దకే వెళ్లి న్యాయం చేసుకోవాలని తాను ఏమి చేయలేనంటూ చేతులెత్తేశాడని బాధితురాలు కన్నీరు మున్నీరు అయ్యింది. ఆపదలో ఉన్న ఆడపిల్లకు రక్షణ కల్పించి న్యాయం చేయడానికి భరోసా కల్పించాల్సిన పోలీసు అధికారి చేతులెత్తేయడంతో ఏం చేయాలో తెలియక దిక్కులేని పరిస్థితుల్లో రేణుక దేపల్లిలో ఉన్న సత్యనారాయణ గౌడ్ ఇంటిముందు న్యాయం కోసం వెళ్ళింది. ఇంట్లో ఉన్నవారు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రి వెళ్ళిపోయారు. అయినా రేణుక తనకు న్యాయం చేయాలంటూ ఇంటి ముందే పడి కాపులు కాస్తుంది. అన్యాయం అయిన ఆడపిల్లను ఆదుకునేందుకు పోలీసులే న్యాయం చేయాలి. ఆ యువతికి జీవితంపై భరోసా కల్పించాలి. అన్యాయమైన రేణుక ముదిరాజ్ పట్ల సభ్య సమాజం స్పందించాలి. ఆడపిల్లలను ఆట వస్తువుగా చూసే మోసగాళ్లకు బుద్ధి చెప్పాలి. ఇదిలా ఉంటే సత్యనారాయణ గౌడ్ బంధువు అయిన విశ్వనాథ్ గౌడ్ ఇతని దాచిపెట్టాడని రేణుక ఆరోపిస్తుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో సత్యనారాయణ గౌడ్ ఉన్నాడని అతని భావ విశ్వనాథ్ గౌడ్ అతని కాపాడుతున్నాడని, తన నుండి వేరు చేసి తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని రేణుక ఆరోపించింది. ఏది ఏమైనాప్పటికీ ప్రేమ పేరుతో వంచించి ఆ తర్వాత పెళ్లి చేసుకుని అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను మోసం చేసిన సత్యనారాయణ గౌడ్ పై చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube