శ్రీవారి దర్శనం పేరుతో మోసం
-లక్షలు కాజేసిన కేటుగాళ్లు
లహరి ,జనవరి11, తిరుపతి : కొద్ది రోజుల క్రితం గుజరాత్ నుంచి 540 మంది భక్తుల బృందం అనేక వివిధ ఆలయాలను సందర్శిస్తూ తిరుపతికి చేరుకున్నారు. శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని పూనీతులు అవ్వాలని భావించారు. తిరుపతిలో తెలిసిన వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆ వ్యక్తి టూరిజంకు చెందిన మరోక వ్యక్తిని వారికి ఫోన్ ద్వారా పరిచయం చేయించారు. అయితే తమకు తెలిసిన లాడ్జ్ యజమాని ఉన్నారని, అతని ద్వారా దర్శనాలు చేయిస్తామని టూరిజంకు చేందిన వ్యక్తి భక్త బృందానంను నమ్మించాడు. అది నమ్మిన భక్త బృందం టూరిజంకు చేందిన వ్యక్తికి, తిరుపతిలోని ఓ లాడ్జ్ యజమానికి కలిపి దాదాపు 6.8 లక్షల రూపాయలు ఫోన్ ఫే, గూగుల్ ఫే ద్వారా నగదును జమ చేశారు.