మోసం కాంగ్రెస్ నైజం.. హస్తం వస్తే మనకూ కరెంటు కష్టాలే
మోసం కాంగ్రెస్ నైజం.. హస్తం వస్తే మనకూ కరెంటు కష్టాలే
మోసం కాంగ్రెస్ నైజం.. హస్తం వస్తే మనకూ కరెంటు కష్టాలే
– ఎమ్మెల్సీ కవిత
టీ మీడియా, అక్టోబర్ 19, హైదరాబాద్ : మోసం కాంగ్రెస్ నైజం అని, ఆ పార్టీకి ఓటేస్తే మనకూ కర్ణాటక గతే పడుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కటకటలు తప్పవని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు. 20 గంటలపాటు కరెంటు ఇస్తామని ఎన్నికలప్పుడు చెప్పి ఇప్పుడు 5 గంటల కరెంట్‌తో సరిపెట్టుకోండని కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కర్ణాటక మంత్రిలానే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కూడా 3 గంటల కరెంటు సరిపోతుందని, 24 గంటల కరెంటు ఇవ్వడం అనవసరమని అన్నారని దుయ్యబట్టారు. కరెంటు కష్టాలు తెచ్చే కాంగ్రెస్ మనకెందుకని, 5 గంటలు, 3 గంటల పార్టీలు మనకొద్దని సూచించారు. దేశంలో ఉచితంగా 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌కే మద్దతుగా నిలుద్దామంటూ ట్వీట్ చేశారు.