లయన్స్ క్లబ్ అద్వర్యం లో ఉచితంగా బిపి.షుగర్ టెస్టులు

లయన్స్ క్లబ్ అద్వర్యం లో ఉచితంగా బిపి.షుగర్ టెస్టులు

1
TMedia (Telugu News) :

లయన్స్ క్లబ్ అద్వర్యం లో ఉచితంగా బిపి.షుగర్ టెస్టులు
టీ మీడియా,మే 18, జగిత్యాల: జిల్లాకొడిమ్యాల మండలం పూడూర్ గ్రామంలో మంగళవారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా కొడిమ్యాల మండల లయన్స్ క్లబ్ అధ్యక్షులు బండ లింగారెడ్డి అద్వర్యం లో రక్తపోటు, షుగర్ బీపీ, క్యాన్సర్ టెస్టులు చేసి ప్రజలకు అవగాహన కల్పించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా బండ లింగారెడ్డి మాట్లాడుతూ బిపి.షుగర్ వ్యాధులను నిర్లక్ష్యం చేయరాదని గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించినప్పుడు అవకాశాన్ని వినియోగించు కోవాలని తెలిపారు.

Also Read : తెలంగాణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ఉజ్జ‌ల్ భూయాన్

ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ డిఎం హెచ్ఓ , డాక్టర్ సమియోద్దీన్ డి ఓ ఎన్ సి డి జగిత్యాల,తేజ్ కిరణ్ డబ్ల్యూ. హెచ్. ఓ కన్సల్టెంట్ డాక్టర్ స్వాతి మెడికల్ ఆఫీసర్ కొడిమ్యాల మరియు సి.హెచ్. ఓ వందన పూడూర్ ఫ్యాక్స్ చైర్మన్ బి.రవీందర్ రెడ్డి,ఎక్స్ ప్రేసిడెంట్ నాగభూషన్ రెడ్డి, లయన్స్ క్లబ్ సెక్రెటరీ వడ్లూరి సంతోష్, లయన్స్ క్లబ్ సభ్యులు అనుమండ్ల అజయ్ రెడ్డి , మార్క మనోహర్ ,గరిగంటి మల్లేశం ,కొత్త రమేష్ ,వార్డ్ సభ్యులు మాణిక్యం శేఖర్ గౌడ్ తొగిటి కిరణ్ ,కుంట మల్లేశం ,గాదె మల్లేశం నాయకులు పెద్ది రవి, ఎండి సజన్, మిట్టపల్లి అనిల్ కుమార్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube