చర్ల ఎబినేజరే చర్చిలో ఉచిత దుస్తులు బహుమతులు పంపిణీ

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 23, చర్ల :

చర్ల మండల కేంద్రంలో గల ఎబినేజరే మందిరంలో గురువారం దుస్తులు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ పంపిణీ కార్యక్రమంకు సంబంధించిన దుస్తులు చీరలు మిర్యాలగూడంకు చెందిన వైద్యుడు ఎస్ రత్నం ఎబినేజరే మందిరంకు ఉచితంగా ఇచ్చారు. ఈ మందిర దైవజనులు పాస్టర్ మీసాల సామ్యేలు చేతుల మీదుగా 200 మంది పేద కుటుంబాలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేసారు. క్రిస్టమస్ సందర్భంగా చిన్నారులకు (సుమారు 40 మందికి) టీచర్ కే యాదగిరి, ధనలక్ష్మి దంపతులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు ఎస్ కిరణ్ కుమార్, సాల్మన్, సంఘస్తులు, పెద్దలు ఐతం రాంబాబు, బట్టా నవీన్ తదితరులు పాల్గోన్నారు.

 A distribution program of sarees was held on Thursday at the Ebenezer hall in the Charla Mandal Center.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube