శిక్షణా తరగతులను వినియోగం చేసుకోవాలి

శిక్షణా తరగతులను వినియోగం చేసుకోవాలి

1
TMedia (Telugu News) :

శిక్షణా తరగతులను వినియోగం చేసుకోవాలి

టీ మీడియా,మార్చి 22,మధిర:తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి తెలంగాణ షెడ్యూల్డు కులాల సహకార అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 26 మరియు 27 తేదీలలో షెడ్యూల్డ్ కులాల జర్నలిస్టులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక శిక్షణ తరగతులను దళిత జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని మధిర ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాగి బాలస్వామి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆడిటోరియంలో మసాబ్ ట్యాంక్ హైద్రాబాదులో మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన ఈ నెల 26న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యం, భాషా పరిజ్ఞానం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మేధావులు సీనియర్ జర్నలిస్టులతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ఎస్సీ జర్నలిస్టులు అందరూ ఈ శిక్షణ తరగతులకు హాజరు కావచ్చునని బాలస్వామి తెలిపారు.
శిక్షణకు హాజరు కావాలనుకునే దళిత జర్నలిస్టులు ఈనెల 25వ తేదీ లోగా ఖమ్మం డిపిఆర్ఓ కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

Also Read : మడుపల్లి శివాలయంకి భారీ విరాళం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube