ఉచిత కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోండి

ఉచిత కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోండి

1
TMedia (Telugu News) :

ఉచిత కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోండి
టీ మీడియా , మర్చి 21,ముత్తారం:పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం.మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ.మాట్లాడుతూ మంథని నియోజకవర్గం లోని నిరు పేద విద్యార్థుల కోసం మాజీ మంత్రివర్యులు మంథని శాసనసభ్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పీజేఆర్ కోచింగ్ సెంటర్ ను మంథని హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత కోచింగ్ సెంటర్ ను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోగలరని అన్నారు కోచింగ్ తీసుకోవాలనుకునే నిరుద్యోగులు మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు ఫారం తీసుకొని రెండు ఫోటోలు ఆధార్ కార్డు జిరాక్స్ వారి విద్యాపరమైన సర్టిఫికెట్ జతపరిచి క్యాంపు కార్యాలయంలో అందజేయాలి అని అన్నారు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు మంథని శాసనసభ్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ముత్తారం మండల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బియ్యని శివ కుమార్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు వాజీద్ పాషా,యువజన కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గాదం శ్రీనివాస్, మరియు నాయకులు బక్కతట్ల కుమార్,దాసరి చంద్రమౌళి,కొల విజయ్, శ్రీనివాస్, ప్రదీప్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : కూసుమంచి సీ.ఎస్. ఐ ఇమ్మానియేల్ చర్చికి ఎమ్మెల్యే కందాళ రూ 5 లక్షల ఆర్థిక సాయం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube