జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య

సర్క్యూలర్ జారీ చేసిన డిఈఓ

1
TMedia (Telugu News) :

జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య

-సర్క్యూలర్ జారీ చేసిన డిఈఓ
టీ మీడియా, జులై 12,సంగారెడ్డి: జిల్లా పరిధిలోని ప్రైవేటు పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించేందుకు జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేష్ సర్క్యూలర్ జారీ చేశారు. సదరు ఆర్డర్ కాపీలను సోమవారం అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి, సంగారెడ్డి మండల విద్యాధికారి వెంకట నర్సింలు సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.సాయినాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నజీర్ అహ్మద్ కు అందచేశారు. ఈ సందర్భంగా డీఈఓ రాజేష్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి కారణంగా జర్నలిస్టులు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుచేత జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య ప్రొసీడింగ్ ను అందిస్తున్నామని అన్నారు.

 

Also Read : ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు సాయినాథ్ మాట్లాడుతు జిల్లాలోని జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య ప్రోసిడింగ్ ను డిఈఓ నాంపల్లి రాజేష్ ఇవ్వడం వల్ల జిల్లలోని జర్నలిస్ట్ లకు మేలు జరుగుతుందని అన్నారు. జిల్లా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు డీఈఓ రాజేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube