ప్రతి జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య

ప్రతి జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య

1
TMedia (Telugu News) :

ప్రతి జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య

టీ మీడియా, జూన్ 21, వనపర్తి బ్యూరో : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ షేక్ యష్మిన్ బాషాల సహకారంతో వనపర్తి జిల్లాలోని అర్హులైన ప్రతి జర్నలిస్ట్ బిడ్డకు ఉచిత విద్యను అందిస్తామని వనపర్తి జిల్ల విద్యాధికారి రవీందర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో జరిగిన టీయూడబ్ల్యూజే జిల్లా విద్యా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అథితులుగా జిల్లా విద్యాధికారి రవీందర్, యూనియన్ జిల్లా అధ్యక్షులు మధుగౌడ్ లు హాజరయ్యారు.ఈ సందర్బంగా డిఈఓ మాట్లాడుతూ… జిల్లాలో గుర్తించబడిన ప్రతి జర్నలిస్టు బిడ్డకు ఉచిత విద్య అందేలా కృషి చేస్తానన్నారు. అందుకు ప్రతి మండల, పట్టణ రిపోర్టర్లు సహకరించాలని కోరారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తనను సంప్రదించాలన్నారు. ప్రభుత్వ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల చెంతకు చేరడం వెనక జర్నలిస్టుల కృషి అభినందనీయమన్నారు. ఈరోజు జర్నలిస్టులకు ఉచిత విద్య అందించేందుకు ప్రయివేట్ పాఠశాలలకు ప్రొసీడింగ్ కాపీలను అందించడం సంతోషాదాయకమని కొనియాడారు.

 

Also Read : పాఠశాలకు ఫ్యాన్ వితరణ

అంతకు ముందు జిల్లా అధ్యక్షులు మధు గౌడ్ మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద యూనియన్ గా గుర్తింపు పొందిన ఇండియన్ జర్నలిస్టు యూనియన్ కు అనుసంధానంగా పని చేస్తూ తెలంగాణ రాష్ట్రoలో కూడా అతి పెద్ద యూనియన్ అయిన టీయూడబ్ల్యూజే (ఐజేయు)లో పని చేస్తూ జర్నలిస్టుల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం, వారి సమస్యలను పరిష్కరిస్తూ ఆపదలో ఉన్న వారిని అదుకోవడమే లక్ష్యంగా పనిచేయడం అదృష్టంగా బావిస్తున్నానన్నారు. ఇక ముందు కూడ జర్నలిస్టులకు అండగా జిల్లా కమిటీ ఎప్పుడు ముందు ఉంటుందని అందుకు సహకరిస్తున్న జిల్లా ,పట్టణ, మండలాల కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు పట్టణంలోని రెండు,మూడు బడా పాఠశాలల యాజమాన్యాలతో మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో వారితో చర్చించి, ఉచిత విద్య అందించేందుకు ఒప్పించినట్టు ఆయన తెలిపారు.జిల్లా యూనియన్ ను విద్య, వైద్య కమిటీలు ఏర్పాటు చేయడంతో ప్రతి ఒక్క జర్నలిస్టుకు లబ్ది చేకూరేల కమిటీ సభ్యులు సఫలీకృతిలు అయ్యారని ఈ సందర్బంగా వారిని అభినందించారు. జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికనవసరం లేదని హామీనిచ్చారు.అనంతరం ముఖ్య అథితిగా హాజరైన జిల్లా విద్యాధికారి రవీందర్ ను శాలువాతో సత్కరించారు. అలాగే జర్నలిస్టుల కోసం కృషి చేస్తున్న జిల్లా విద్య కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మోహన్, కుమార్ లను కూడా యూనియన్ సభ్యులు సత్కరించారు.

Also Read : రేషన్ షాప్ లో ఉచిత రేషన్ బియ్యం

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బోలెమోని రమేష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు నవీన్ కార్యదర్శి శివ, సీనియర్ జర్నలిస్టు పౌర్ణ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లక్ష్మన్, ప్రధాన కార్యదర్శి మన్యం, జిల్లా హెల్త్ కన్వీనర్ గంధం దినేష్, జిల్లా ప్రచార కార్యదర్శి రమేష్ రావు, కోశాధికారి అంజి, పట్టణ ప్రచార కార్యదర్శి మోహన్ బాబు, ప్రధాన ఫరూక్ పటేల్, పట్టణ కమిటీ సభ్యులు,పానుగల్ శ్రీరంగపూర్ మండలాల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి వెంకటేష్ గౌడ్ జిల్లా, పట్టణ జర్నలిస్టులు వెంకన్ గౌడ్ రాజేందర్ మనోహర్ లతో పాటు ఆయా మండలాల పట్టణ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube