ఉచిత వైద్య శిబిరంను ప్రారంభించిన డాక్టర్ కోట రాంబాబు

ఉచిత వైద్య శిబిరంను ప్రారంభించిన డాక్టర్ కోట రాంబాబు

1
TMedia (Telugu News) :

ఉచిత వైద్య శిబిరంను ప్రారంభించిన డాక్టర్ కోట రాంబాబు

టీ మీడియా, ఎర్రుపాలెం, మార్చి13:

ఎర్రుపాలెం మండలం నారాయణపురం గ్రామంలో దోమాందుల చిన్నముత్తయ్య ట్రస్ట్ అధ్వర్యంలో చిన్నముత్తయ్య
కుమారుడు గ్రామ ఎంపిటిసి దోమాందుల సామెలు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిభిరంను టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు, కె వి అర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కోట రాంబాబు హాజరై వైద్య శిభిరం ను ప్రారంభించి, రక్తపరీక్షలు చేసి అవసరమైన వాటికి మందులను ఉచితంగా అందించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ కోట రాంబాబు మాట్లాడుతూ….

also read:అభివృద్ధి పనులు ప్రరంబిచిన మంత్రి పువ్వాడ

ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిరు పేదలకు వైద్య సేవలు అందించడం చాలా గొప్ప విషయం అని, అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ హాస్పిటల్ కి వెళ్లి చూపించు కోలేని వారికి ఇవి ఎంతో ఉపయోగ పడతాయని చెప్పారు. ఈ శిభిరం నందు దాదాపు 500 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించారు.ఈ శిభిరం నందు వైద్యులు డాక్టర్ కె. అనిల్,డాక్టర్ రమాదేవి, డాక్టర్ లక్ష్మీప్రకాష్ బి డి యస్, నిహాల్ లాబ్ కరెస్పాండంట్ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ బొగ్గుల లక్ష్మి , రాజుపాలెం గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి, గౌరవరం సర్పంచ్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube