స్విమ్స్ విద్యార్థులకు ఉచితంగా భోజ‌నం

టీటీడీ ఈవో

1
TMedia (Telugu News) :

స్విమ్స్ విద్యార్థులకు ఉచితంగా భోజ‌నం

– టీటీడీ ఈవో

టీ మీడియా, సెప్టెంబర్ 9, తిరుప‌తి : స్విమ్స్‌లో ఫిజియోథెర‌పీ, న‌ర్సింగ్, పారామెడిక‌ల్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల‌కు ఉచితంగా భోజన స‌దుపాయం క‌ల్పించ‌డం కోసం ఏర్పాటుచేసిన నూత‌న వంట‌శాల‌ను టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వంట‌శాల‌లోని స‌దుపాయాలను ప‌రిశీలించారు. విద్యార్థుల‌కు త‌యారు చేసే ఆహారానికి సంబంధించిన మెను గురించి అడిగి తెలుసుకున్నారు.విద్యార్థుల నుంచి నెల‌కు రూ.3500/- వ‌సూలు చేసి కాంట్రాక్టర్ ద్వారా ఇప్పటివ‌ర‌కు భోజ‌న స‌దుపాయం క‌ల్పించేవార‌ని చెప్పారు.

Also Read : ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలి

టీటీడీ చైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి ఆదేశాల మేర‌కు విద్యార్థులంద‌రికీ ఉచితంగా స్వామివారి అన్నప్రసాదం అందిస్తున్నట్టు వెల్లడించారు. 800 మంది విద్యార్థిని విద్యార్థుల త‌ల్లిదండ్రులకు ఈ నిర్ణయం వ‌ల్ల కొంత‌మేర‌కైనా ఆర్థిక‌భారం త‌గ్గుతుంద‌ని ఈవో చెప్పారు.విద్యార్థులు 30 బృందాలుగా ఏర్పడి ప్రతిరోజూ హాస్టల్ గ‌దులు, వంట‌శాలను శుభ్రం చేసుకోవాల‌ని సూచించారు. విద్యార్థులు కూడా క్రమ‌శిక్షణ‌, స‌త్ప్రవ‌ర్తన‌తో వ్యవ‌హ‌రించ‌క‌పోతే వారి మీద కూడా చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube