టీ మీడియా నవంబర్ 19: కొణిజర్ల
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ సహకారంతో గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్దగోపతి ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ పాల్గొన్నారు. ఈ శిబిరం నందు గ్రామ ప్రజలకు అవసరమైన మందులు రక్త పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది. చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం డి .ఆర్ పి వి శివయ్య మాట్లాడుతూ ప్రజలందరూ ఉచిత రక్త పరీక్షలు చేయించుకొని తగిన మందులు వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
పెద్ద గోపతి హెచ్ ఈ ఓ జే జాన్సన్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకోవాలని. ఆ విధంగా వేసుకున్నట్లయితే కరోనా వైరస్ ను కట్టడి చేయగలమని వారు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చలో మోహన్ రావు, ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు, ఆర్ఎంపి లేడీ బోయిన గోపాల్ రావు, పెద్దగోపతి పిహెచ్సి డాక్టర్ రమేష్, లింక్ వర్కర్స్ స్కీమ్ డి ఆర్ పి వి శివయ్య, సూపర్ వైజర్ డీ నీరీష లింక్ వర్కర్స్ నాగమణి, సుధారాణి, నాగమణి ఏఎన్ఎం వనజ, ఆశా వర్కర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.