టీ మీడియా నవంబర్ 28 వనపర్తి : వనపర్తి పట్టణంలోని నాలుగో వార్డ్‌లో మైత్రి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కృష్ణ, నాలుగో వార్డ్ కౌన్సిలర్ పద్మ పరశురామ్ ప్రారంభించారు. అనంతరం జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిరుపేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అనుభవజ్ఞులైన వైద్యులు గుండె, కిడ్నీ, మధుమేహం, బీపీ, షుగర్, కీళ్లనొప్పులు తదితర వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు.
ప్రముఖ వైద్యులు శ్రీనివాస్ రెడ్డి, దొరబాబు, చాంద్ పాష, శ్రీనివాస్ గౌడ్, పృథ్విరాజ్ గౌడ్, ప్రణీత వైద్యులతో కూడిన సుమారు 400 మందికి పైగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అలాగే ఉచిత వైద్య సేవలు అందించిన వైద్యులకు నాయకులు శాలువాతో సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.కృష్ణ ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్, కుమారస్వామి, కౌన్సిలర్ పుట్టపాక మహేష్,రాజశేఖర్, బుచ్చరాము, శ్రీశైలం, రవి,సాగర్, రమేష్ యువకులు రాము, పవన్, దుర్గేష్ ,చిన్న, చింటూ, శివ తదితరులు పాల్గొన్నారు.