లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

1
TMedia (Telugu News) :

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

టీ మీడియా, మార్చి 14, ధర్మపురి :జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పట్టణ, లయన్స్ క్లబ్ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు జక్కు రవీందర్, మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గల స్థానిక రేకుర్తి ఐ హాస్పిటల్ వారి సహకారంతో, ఈ నెల 8 వ తేదీన, స్థానిక ఎస్ఎచ్ గార్డెన్ యందు, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. దానిలో భాగంగానే అదే రోజు మొదటి విడతలో, 30 మందిని రేకుర్తి ఐ హాస్పిటల్ కు తరలించి, ఉచిత కంటి ఆపరేషన్లు చేయించి, 10 వ తేదీన వారిని, బస్ సౌకర్యం ఏర్పాటు చేసి, ధర్మపురి తీసుకు రావడం జరిగింది అని తెలిపారు.

Also read : పెండింగ్ ఈ చలాన్ల రాయితీ పై అవగాహన

అదే విధంగా రెండవ విడతలో, 11 వ తేదీన మరో 30 మందిని, రేకుర్తి ఐ హాస్పిటల్ కు, ఉచిత బస్ సౌకర్యం కల్పించి, వారిని పంపించి విజయవంతంగా, రెండు దఫాలుగా ఆపరేషన్లు చేయించి, ఆదివారం రోజున ధర్మపురి తీసుకు రావడం జరిగింది అని తెలిపారు. ఇంకా 60 మంది టెస్టులు అయి వున్నారు. వారిని మరో రెండు విడతలుగా, టైమ్ కేటాయించి, వారికి సమాచారం అందించి, వారిని కూడా ఆసుపత్రికి తీసుకెళ్లి, ఆపరేషన్లు చేయిస్తామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జక్కు రవీందర్ తో పాటు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పిన్న శ్రీనివాస్, కార్యదర్శి కట్ట శ్రీ హరి, కోశాధికారి సిర్ప రాజయ్య, లతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు, పప్పుల శ్రీనివాస్, డాక్టర్ రవీందర్, పైడి మారుతి, తదితరులు పాలుగోన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube