విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం

విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం

1
TMedia (Telugu News) :

విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం

టీ మీడియా, మే 11, వనపర్తి బ్యూరో : జిల్లా కేంద్రంలోని నాలుగో వార్డ్ బాల్నగర్ కాలనీ వాసులకు ఉచిత వైద్యం చేయించినా కౌన్సిలర్ పద్మా పరుశురాం
ఎముకల నొప్పులతో బాధపడుతున్న 50 మందికి చిరో ప్రాక్టిక్ ట్రీట్మెంట్
రోగులకు ఉచితంగా మందుల పంపిణీ ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. ఆధ్వర్యంలో ఎముకల ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 50 మంది కాలనీ ప్రజలకు ఎం.ఎస్.ఆర్ క్లినిక్ వైద్యులు.డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో రోగులకు వైద్య చికిత్సలు అందించారు.అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

Also Read : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన ఉన్నత అధికారులు

ఆర్గానిక్ మందుల వల్ల రోగులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని డాక్టర్ .రమేష్ తెలిపారు.ఆర్తో వైద్యం తీసుకున్న వారు ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన సూచించారు.ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించిన కౌన్సిలర్ దంపతులకు ఎమ్మెస్సార్ క్లినిక్ వైద్య సిబ్బంది, కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి పరశురాం, బిజెపి సీనియర్ నాయకులు సురేందర్, విజయ్, శేఖర్ రెడ్డి, జి యాదగిరి గోరేమీయా మన్యం, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube