ఉచిత ధ్యాన భోదన కార్యక్రమం

-ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస

1
TMedia (Telugu News) :

ఉచిత ధ్యాన భోదన కార్యక్రమం

-ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస

టి మీడియా,నవంబర్ 12,ఖమ్మం : పి.ఎస్.ఎస్.ఎం. మాస్టర్ల ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహా పత్రీజీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని స్థానిక వర్తక సంఘం భవనంలో ఆత్మారామ ధ్యాన ఆశ్రమం వారి సారధ్యంలో స్వర్ణమాల పత్రీజీ దివ్య ఆశీస్సులతో మహా ధ్యానం , మహా మౌనం , మహా స్వాధ్యాయం అనే నినాదంతో ఉచిత ధ్యాన భోదన కార్యక్రమాన్ని నిర్వాహకులు చేపట్టారు . ఈ సందర్భంగా ( సీనియర్ పిరమిడ్ మాస్టర్ ) రాష్ట్ర పిరమిడ్ సేవాదళ్ ఉపాధ్యక్షులు సూరంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ… బ్రహ్మర్షి పితామహా పత్రీజీ జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయని పేర్కొన్నారు . 40 సంవత్సరాల పాటు ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఎంతో కృషి చేశారన్నారు . ధ్యానం సకల సమస్యలకు పరిష్కారం అని , ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ప్రతిరోజు 24 గంటలు టైం లో కొంత టైం ను కేటాయించాలన్నారు .

Also Read : ఉపాధ్యాయులకు బదిలీలు , పదోన్నతులు వెంటనే చేపట్టాలి

ధ్యాన సాధన వల్ల సంపూర్ణ ఆరోగ్యం మరియు మనశాంతి లభిస్తుందని , పరిస్ధితుల పై అవగాహన కలిగి సంతోషమైన జీవితాన్ని పొందొచ్చని , ఏకాగ్రత , జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందన్నారు . సమస్త విశ్వానికి చెందిన అద్భుతమైన శక్తి క్షేత్రాలు పిరమిడ్స్ నిర్దిష్టమైన కొలతలతో పిరమిడ్ నిర్మించటం ద్వారా విశ్వమయ ప్రాణశక్తిని అధికంగా తీసుకుని , ఆ ప్రదేశంతో పాటు పరిసరాలను కూడా విశిష్టమైన శక్తి క్షేత్రంగా మార్చి ప్రకృతిని సమతుల్యం చేస్తుందన్నారు . ప్రకృతిని సమతుల్యం చేయడం వలన సకల జీవరాశి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికీ మరియు సమస్త మానవాళి యొక్క మానసిక ప్రశాంతతకు , సర్వ ప్రాణికోటి యొక్క ఆరోగ్య పోషణకు తోడ్పడుతుందన్నారు . ఓ దేవాలయంగా , ఓ వైద్యాలయంగా , ఓ విశ్వాలయంగా సమస్త మానవాళికి ఒక అద్భుతమైన వరంగా ప్రతిష్టాత్మకమైన కట్టడంగా మన గ్రామంలో, పట్టణంలో వెల్లివిరిసిన దివ్యశక్తి ధామం ‘పిరమిడ్ ధ్యాన క్షేత్రం” అని అన్నారు .

Also Read : ఎస్సై , కానిస్టేబుల్ పోస్టుల పోటీ వారికి అవగాహన

“ధ్యానం” ద్వారా వారు జీవితంలో అన్ని కోణాలలోనూ అభివృద్ధిని సాధించి , బహుముఖ ప్రజ్ఞారాలురుగా ఎదుగుతారు . వారిలో భౌతిక ఆరోగ్యం , మానసిక పరిణితి , భావ స్పష్టత , బుద్ధి కుశలతతో పాటు ఆధ్యాత్మిక అవగాహనను కలిగి ఉంటారన్నారు . ధ్యానం సకల భోగ , రోగ నివారణి , ధ్యానం సత్యజ్ఞానాన్ని ప్రసాదిస్తుందని , ధ్యానం దివ్య ఔషధం , ధ్యానం సకల సమస్యలకు మార్గమని తెలిపారు . ఈ ఉచిత ధ్యాన కార్యక్రమాన్ని సుమారు 200 మంది ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు . ఈ కార్యక్రమంలో బ్రహ్మ విద్వన్మణి శ్రీ నలజాల సరోజ మేడం ( కాస్మిక్ వ్యాలీ ) , నక్షత్ర మిత్రులు హరికృష్ణ సార్ , పురుషోత్తం , శోభారాణి , ఉదయలక్ష్మి , లలిత , మాన్యం కృష్ణ , శేషాద్రి సిరోమని , రాజర్షి రాజశేఖర్ జయహో పత్రీజీ తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube